Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 2, 2026Short Read
తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం!
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం జులై నెలలో రికార్డు స్థాయిలో నమోదైంది.
ఈ ఒక్క నెలలోనే ఏకంగా రూ.140.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
జులై నెలలో స్వామివారిని 24.52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.టీటీడీ చరిత్రలో ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఇంతకుముందు 2022 ఆగస్టు నెలలో అత్యధికంగా రూ.140.34 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
కరోనా మహమ్మారి తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో, ప్రతినెలా స్థిరంగా రూ.100 కోట్లకు పైగానే హుండీ ఆదాయం సమకూరుతోందని టీటీడీ వివరించింది.




